ఆంధ్ర పోలీసులపై కేసు | ఆంధ్ర రాష్ట్రప్రభుత్వానికీ నోటీసులు | ఆంధ్ర ప్రభుత్వ డేటాను 'ఐటీ గ్రిడ్స్‌' చోరీ

    డేటాపై రాష్ట్ర ప్రభుత్వానికీ నోటీసులిస్తాం
    అమెజాన్‌ సంస్థకు కూడా పంపుతాం
    ఐటీ గ్రిడ్స్‌పై విచారణ కొనసాగుతోంది
    సీఈవో అశోక్‌ మా వద్దకు రావాలి
    లేదంటే అరెస్టుచేసి తీసుకొస్తాం
    సైబరాబాద్‌ కమిషనర్‌ హెచ్చరిక
    ఉద్యోగుల కుటుంబీకులకు వేధింపులు
    ఏపీ పోలీసులపై సజ్జనార్‌ ఆరోపణ 

ఆంధ్ర పోలీసులపై కేసు


 SOURCE : హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) :
వైసీపీ నేతల ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్‌ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఉద్యోగులను అదుపులోకి తీసుకొని.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వారిని న్యాయమూర్తుల ముందు హాజరు పరచిన సైబరాబాద్‌ పోలీసులు.. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపైనా కేసు నమోదుచేశారు. ఆంధ్ర ప్రభుత్వ డేటాను ఐటీ గ్రిడ్స్‌ చోరీ చేసిందని ఫిర్యాదుచేసిన లోకేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఏపీ పోలీసులు బెదిరించారని.. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. దౌర్జన్యం చేశారని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అంతేకాదు.. ఆంధ్ర రాష్ట్రప్రభుత్వానికీ నోటీసులు జారీచేస్తామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.
ఆంధ్ర పోలీసులపై కేసు
ఆంధ్ర పోలీసులపై కేసు
 సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీపై విచారణ కొనసాగుతోంది. కంపెనీ సీఈవో అశోక్‌ ఎక్కడున్నా పోలీసుల ఎదుట హాజరవ్వాలి. ఇప్పటికే అతడికిచ్చిన నోటీసు గడువు ముగిసింది’ అని తెలిపారు. ఆంధ్ర ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్‌, ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు డేటా ఐటీ గ్రిడ్‌ ఇండియా కంపెనీ చోరీ చేసి, దుర్వినియోగం చేస్తోందని ఈ నెల 2న లోకేశ్వరర్‌రెడ్డి అనే డేటా అనలిస్టు, సామాజికవేత్త మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని.. టీడీపీకి చెందిన సేవామిత్ర అనే యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, ఏపీ ప్రజల డేటాను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని సజ్జనార్‌ చెప్పారు. దాంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని, కంపెనీ ఉద్యోగులైన రేగొండ భాస్కర్‌, కడలూరి ఫణికుమార్‌, రెబ్బాల విక్రమ్‌, చంద్రశేఖర్‌లను విచారించినట్లు చెప్పారు. ‘మరుసటి రోజు వారికి 160 సీఆర్‌పీసీ నోటీసులిచ్చాక.. వారి సమక్షంలోనే కంపెనీలో సోదాలు నిర్వహించి హార్డ్‌ డిస్క్‌లు, సీపీయూలు, డేటాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాం.

నిందితులపై ఐపీసీ 120బీ, 379, 420, 188 ఐటీ యాక్టు 72, 66బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం’ అని చెప్పారు. కంపెనీలో పోలీసుల సోదాలు జరుగుతున్నా దాని సీఈవో అశోక్‌ ఇప్పటి వరకు పోలీసుల ముందుకు రాలేదని.. పైగా కంపెనీ ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసి.. కేసును, న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించారని.. నలుగురు వ్యక్తులు మా అధీనంలోనే ఉన్నారని, నోటీసులిచ్చాకే విచారిస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ‘కమిషనర్‌గా ఉన్న నన్ను గానీ, స్థానిక ఇన్‌స్పెక్టర్‌ను గానీ సంప్రదించకుండా లోకేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? మా అదుపులో ఉన్న భాస్కర్‌తో పాటు, మిగిలిన వారి ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబ సభ్యులను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడమేంటి? పోలీసుల పనితీరును తప్పుబట్టి, విమర్శలు చేస్తున్న కంపెనీ సీఈవో ఎందుకు పరారీలో ఉన్నారు? వెంటనే హాజరై అతడి వద్దకు ఆంధ్ర ప్రజల వ్యక్తిగత డేటా ఎలా వచ్చిం ది...? ఎవరిచ్చారు..? ఎందుకిచ్చారు.. అనే వివరాలను పోలీసుల ముందు వివరించాలి. వెంటనే లొంగిపోకపోతే ఎక్కడున్నా అరెస్టు చేసి తీసుకు రావలసి ఉంటుంది’ అని సజ్జనార్‌ హెచ్చరించారు.

బాధ్యులైన అధికారుల వివరాలు అడిగాం

‘ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, కులం, ప్ర భుత్వ సంక్షేమ పథకాల లబిఽ్ధదారుల సమాచారం ఒక ప్రైవేటు ఐటీ కంపెనీలో ఎందుకుంది.. వారికి ఈ డేటా ఎలా అందింది? అందుకు బాధ్యులైన అధికారు లు ఎవరో తెలియజేయాలని ఆంధ్ర ప్రభుత్వ యం త్రాంగానికి నోటీసులు జారీ చేస్తాం. తమ వద్ద ఉన్న సమాచారమంతా ఐటీ గ్రిడ్‌ కంపెనీ సేవామిత్ర యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌లో దాచిపెట్టడం గుర్తించాం. అందుచేత అమెజాన్‌కూ నోటీసులు జారీ చేస్తాం. ఓటర్ల జాబితాకు సంబంధించిన సమాచారం చోరీ జరగడంపై ఎలక్షన్‌ కమిషన్‌కు, ఆధార్‌ సమాచారానికి సంబంధించి యూఐడీఏఐ శాఖకు లేఖలు రాస్తాం. ఎన్నికల డేటా దుర్వినియోగంపై ఏపీలో ఇప్పటికే సుమారు 50 ఫిర్యాదులు అందినట్లు మా దృష్టికి వచ్చింది’ అని సజ్జనార్‌ అన్నారు.

అసలు విషయం వదిలేసి..

కేసుకు సంబంధించి అసలు విషయాలు వదిలేసి, కొసరు విషయాలు మాత్రమే సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆంధ్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన డేటాను ఫలానా ఐటీగ్రిడ్‌ కంపెనీ చోరీ చేసి, దుర్వినియోగం చేస్తోందని లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారని.. దానిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సజ్జనార్‌ చెప్పారు. కానీ ఆ చోరీ చేసిన సమాచారం ఎక్కడైనా దుర్వినియోగమైనట్లు లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఆధారాలు చూపించనేలేదు. దీనిపై కమిషనర్‌ను ప్రశ్నించగా.. ‘ఇప్పుడే కదా కంప్యూటర్‌, హార్డ్‌డి్‌స్కలను సీజ్‌ చేశాం.. తదుపరి విచారణలో అన్ని విషయాలూ తెలుస్తాయి’ అని బదులిచ్చారు.