కె.జి.ఎఫ్ 2 క్లైమాక్స్ షూట్: హైదరాబాద్ వస్తోన్న యష్, సంజయ్ దత్!

కె.జి.ఎఫ్ 2 క్లైమాక్స్ షూట్: హైదరాబాద్ వస్తోన్న యష్, సంజయ్ దత్!
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల ఆగిన కె.జి.ఎఫ్: చాప్టర్ 2 షూటింగ్ సుమారు ఐదు నెలల విరామం తరవాత ఆగస్టు 26న బెంగళూరులో ప్రారంభమైంది. అయితే, ఈ షెడ్యూల్‌లో హీరో పాల్గొనలేదు. ప్రకాష్ రాజ్ సహా మరికొంత నటీనటులపై ఇప్పటి వరకు సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో యష్‌తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి బుధవారం తమ టీమ్‌తో జాయిన్ అయ్యారు. ఇక ఇక్కడి నుంచి లీడ్ పెయిర్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కాగా, ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కె.జి.ఎఫ్ టీమ్ హైదరాబాద్ వస్తోంది. ‘‘బెంగళూరులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే టీమ్ హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. అక్కడ వేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు’’ అని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యక్తి ఒకరు ముంబై మిర్రర్‌కు వెల్లడించారు. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ కోసం హీరో యష్ గత కొన్ని నెలలుగా చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అధీరాగా సంజయ్ కనిపించనున్నారు. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’లో రాకీ భాయ్, అధీరా మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. ‘‘సంజయ్ ఇప్పటికే తన సన్నివేశాలను చాలా వరకు పూర్తి చేశారు. కొన్ని సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ కోసం నవంబర్ తొలి వారంలో సంజయ్ టీమ్‌తో జాయిన్ అవుతారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించారు. కాగా, సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఆయన కాస్త విరామం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, నవంబర్‌లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలుపెట్టాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. లాక్‌డౌన్ సమయంలోనూ వీడియో కాల్స్ ద్వారా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగాయి. నవంబర్ ఆఖరి వారం నుంచి నిర్విరామంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. నిజానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగడంతో విడుదల వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. Also Read:


https://ift.tt/2SHFztz taken from source: