ప్రముఖ తమిళ నటుడు కార్తి, ఆయన భార్య రంజని రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. 2011లో కార్తి, రంజని వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2013లో వీరికి పాప జన్మించింది. ఆమెకు ఉమయాళ్ అని నామకరణం చేశారు. అయితే, మరోసారి తండ్రి కాబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడే ఈ కార్తి అని అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పిల్లలే సూర్య, కార్తి. వీరికి సోదరి బృంద శివకుమార్ కూడా ఉన్నారు. సూర్య హీరోయిన్ జ్యోతికను పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 2006లో జరిగింది. సూర్య, జ్యోతిక దంపతులకు దియా, దేవ్ ఇద్దరు సంతానం. మరికొద్ది రోజుల్లో కార్తి కూడా ఇద్దరు పిల్లలకు తండ్రి కాబోతున్నారు. ఇక కార్తి సినిమాల విషయానికి వస్తే.. ఆయన తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. కిందటేడాది ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది. Also Read: కార్తి ప్రస్తుతం ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిన్న షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో కార్తి సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా రష్మిక కోలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమా టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని గతంలో రూమర్స్ వచ్చాయి. అయితే, ఇందులో నిజం లేదని.. ‘సుల్తాన్’ కథ వేరని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.
https://ift.tt/3iIgYiT taken from source:
Social Plugin