అదే కొంపముంచింది.. చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన హాస్యనటుడు

అదే కొంపముంచింది.. చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన హాస్యనటుడు
హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన నటుడు బి. పద్మనాభం. కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించిన ఆయన పూర్తిపేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు స్టార్‌ హోదా అనుభవించిన ఆయన చివరి రోజుల్లో ఎంతో పేదరికం అనుభవించారు. సినీ పరిశ్రమలో మంచితనం అనేది శ్రుతిమించితే ఎంత ప్రమాదకరమో పద్మనాభం జీవితాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేకే చిత్తూరు నాగయ్య వంటి మహానటులు చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో ‘సినిమా వైభవం’ చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పుచేశారు పద్మనాభం. అందుకు హామీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఓ వ్యక్తికే చెందుతాయన్నది అగ్రిమెంట్. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చకపోవడంతో ఆ సినిమాల హక్కులు రుణదాత పరమయ్యాయి. దీంతో సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు రూ.2.75లక్షలకు అమ్మేశారు. Also Read: అప్పు తీరగా మిగిలిన డబ్బులను ఆయన పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగటివ్‌లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా ఈ కేసు కోర్టులో నడిచినా పద్మనాభానికి న్యాయం జరగలేదు. అదే సమయంలో ఆయనకు సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లడంతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. చివరికి ఆయన చనిపోయాక కుటుంబసభ్యులు ఆ వ్యక్తికి రూ.లక్ష చెల్లించి నెగిటివ్‌లు తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో మహానటులు చివరి దశలో అప్పుల పాలై, ఎవరూ పట్టించుకోక కన్నుమూశారు. తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పద్మనాభం ఫిబ్రవరి 20, 2010న చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.


https://ift.tt/2SytA1h taken from source: